Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

  • మ‌రోసారి కమ్ముకున్న మేఘాలు 
  • పలుచోట్ల ట్రాఫిక్ జామ్
  • వాహనదారుల ఇక్కట్లు
హైదరాబాద్ లో మ‌రోసారి మేఘాలు క‌మ్ముకున్నాయి. ప‌లుచోట్ల జోరువాన కురుస్తోంది. న‌గ‌రంలోని కూకట్ పల్లి, ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్సార్ న‌గ‌ర్‌, యూస‌ఫ్‌గూడ‌, మోతీ న‌గ‌ర్‌, మణికొండ, గచ్చిబౌలి, అమీర్ పేట, టోలిచౌకీ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లిలో ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డుతోంది.

తార్నాక, బేగంపేటతో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి ప‌లు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కార‌ణంగా తెలంగాణ‌లో భారీ వర్షాలు పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు.

rain

More Telugu News